భారత్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సాధారణంగా అయితే పర్యాటక ప్రాంతాలు ఎప్పుడు పర్యాటకులతో కళకళలాడుతుంటాయ్. కానీ కరోనా వైరస్ కారణంగా పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కొంత మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక పర్యాటకులపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఉండడం గమనార్హం. దీంతో  వివిధ పర్యటనలకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటున్న ఎంతోమంది నిరాశ చెందుతున్నారు.  దాదాపు అన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ప్రస్తుతం భారత్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా బీచ్ కూడా ఒకటి.  అందమైన గోవా బీచ్ లో ఎంజాయ్ చేయడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కేవలం యువత మాత్రమే కాదు అటు అన్ని వయసుల వారు కూడా గోవా బీచ్ కి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.  అందమైన గోవా బీచ్ లో తిరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్వానించాలని  అనుకుంటారు.  కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇలా గోవా బీచ్ కు వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది.  కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక గోవా బీచ్ కి పర్యాటకులను అనుమతి పై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది.



 దీంతో గోవా బీచ్ వెళ్లాలి అనుకున్న వారందరికీ ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి. అయితే ఇటీవలే పర్యాటకుల అనుమతి విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ గోవా పర్యటనకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా   మీరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అది కూడా ఒక డోస్ కాదు ఏకంగా రెండు డోసులు తీసుకున్నవారికి రాష్ట్రంలోకి అనుమతిస్తామని ముందుగా వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో  వైరస్ కేసుల నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.  డెల్టా వేరియంట్ భయంతో ఏకంగా ఆంక్షలను జూలై 5 వరకు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: