కాంగ్రెస్ నుంచి గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా చేసిన వారిని రాళ్లతో కొట్టడంలో తాను ముందుంటా నన్నారు. పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయె సన్నాసులకు సిగ్గు ఉండాలని చెప్పారు. ఇక ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ ప్రకటించారు.
సంతలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నాడని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాలు చేశారు. తెలంగాణ ఇచ్చింది సొనియా అని ప్రజలకు సొనియాపై నమ్మకం ఉందని రేవంత్ చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని... వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఏదేమైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ మారిన వారిలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ జంపింగ్ జపాంగ్‌లు రేపు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.