ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎప్పుడు ఉంటుందో కానీ ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లోనూ... మంత్రి పదవులు ఆశిస్తున్నవారి మదిలో మామూలు ఆందోళన అయితే లేదు. క్యాబినెట్ లో ఉన్న నేత లో ఎవరు ఉంటారు ? ఎవరు బయటికి వెళ్లి పోతారు అన్నది ఒక టెన్షన్... అయితే కొత్తగా క్యాబినెట్లో ప్లేస్ ఆశిస్తున్న వారు సైతం టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ క్యాబినెట్ లో ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రుల్లో ఎవరు అవుట్ ? అవుతారు... ఎవరు ఇన్ ? అవుట్ అవుతారు అన్నదానిపై కూడా వైసీపీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. 

ఇప్ప‌టికే జ‌గ‌న్ కేబినెట్లో ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రులు ఉన్నారు. ఎస్టీ వ‌ర్గం నుంచి పాముల పుష్ప శ్రీ వాణి, కాపు సామాజిక వ‌ర్గం నుంచి ఆళ్ల నాని, ఎస్సీ వ‌ర్గం నుంచి క‌ళ‌త్తూరు నారాయ‌ణ స్వామి, బీసీ వ‌ర్గం నుంచి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మైనార్టీ వ‌ర్గం నుంచి అంజాద్ బాషా ఉప ముఖ్య‌మంత్రులుగా ఉన్నారు.

ఈ ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్ ప‌ద‌వి సేఫ్ అని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆయనకు జగన్ కొద్ది రోజుల క్రితమే ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. పాముల పుష్ప శ్రీవాణి ని తప్పిస్తారు అన్న వార్తల నేపథ్యంలో ఎస్టీ సామాజికవర్గం నుంచి పీడికల‌ రాజన్నదొర లేదా తెల్లం బాలరాజు లలో ఎవరో ఒకరు మంత్రి అవడంతో పాటు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనారిటీ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజాద్ బాషాను తప్పిస్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్త‌ఫాకు మంత్రి ప‌ద‌వితో పాటు ఉప ముఖ్య‌మంత్రి ఛాన్స్ రావ‌చ్చు. అయితే అంజాద్ బాషాతో జ‌గ‌న్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు.. పైగా సీమ నుంచి ముస్లిం వ్య‌క్తి కేబినెట్లో ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తే ఆయ‌న ప‌ద‌వి కూడా సేఫే..!

ఇక ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న నారాయ‌ణ స్వామి కూడా కేబినెట్లో ఉంటారా ?  ఉండ‌రా ? అన్న‌ది డౌట్‌గానే ఉంది. ఆయ‌న్ను త‌ప్పిస్తే ఆ ప‌ద‌వి ఆదిమూల‌పు సురేష్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక ఓసీ కాపు కోటాలో మంత్రిగా ఉన్న ఆళ్ల నాని కూడా ఉప ముఖ్య‌మంత్రిగానే ఉన్నారు. న‌లుగురు కాపు మంత్రుల్లో జ‌గ‌న్ ఎవ‌రిని ఉంచుతారు ? ఎవ‌రిని త‌ప్పిస్తారు ? అన్న దానిపై క్లారిటీ లేదు. ఆళ్ల నాని కేబినెట్లో ఉంటే ఆయ‌నే ఉప ముఖ్య‌మంత్రిగా ఉంటారు.. లేని ప‌క్షంలో మ‌ళ్లీ కాపు మంత్రుల్లోనే ఎవ‌రో ఒక‌రికి ఈ ప‌ద‌వి రావ‌చ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: