అయితే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అభిజిత్ ముఖర్జీ ఇక తండ్రి మరణం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ప్రస్తుతం హాట్ టాపిక్ మారిపోయింది అంతేకాకుండా ఇది అటు బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే 2011లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు అభిజిత్ ముఖర్జీ. ఆ సమయంలో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కూడా ఓ సారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు అభిజిత్ ముఖర్జీ.
2019 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు అభిజిత్ ముఖర్జీ. అదే సమయం అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూశారు అభిజిత్ ముఖర్జీ. ఇక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జతకట్టడం పై విభేదించారు. ఇక ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో బిజెపి మత ప్రచారాన్ని మమత కంట్రోల్ చేశారని ప్రశంసించారు. కాంగ్రెస్ లో తనకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని అందుకే టీఎంసీలో చేరినట్లు అభిజిత్ ముఖర్జీ చెప్పుకొచ్చారు.