రియల్ హీరో సూద్ సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గానూ ప్ర‌జ‌లు ప్రజాప్ర‌తినిధులు ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా తాజాగా సోనూ సూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను క‌లిసి సోనూ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ అభినందించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా నలుమూలల నుండి వస్తున్న రిక్వెస్ట్ ల‌కు సోను సూద్ స్పందిస్తున్న‌ తీరుపై కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభంలో ఆశాజ్యోతిగా... వ్యక్తిగత స్థాయిలో లో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 

అంతే కాకుండా సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తన తల్లి స్పూర్తితోనే తాను ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సోనూ కేటీఆర్ కు తెలిపారు. తన‌కు హైదరాబాద్ పట్ల ఇక్కడి ప్ర‌జ‌ల‌ పట్ల ఉన్న అనుబంధాన్ని కేటీఆర్ తో సోనూ సూద్ పంచుకున్నారు. ఈ సమావేశంలో సోనూ సూద్ కూడా కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణ కు ఎన్నో కంపెనీలు రావడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఇతరులకంటే భిన్నంగా క‌రోనా లాంటి కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ఆదుకుంటున్నకేటీఆర్ అంటే తనకెంతో గౌరవమని తెలిపారు. ఇక ఈ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ తో కలిసి సోనూ సూద్ లంచ్ చేశారు.

అనంతరం సోనూ సూద్  చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను శాలువా కప్పి కేటీఆర్ సన్మానించారు. అనంత‌రం సోను సూద్ కూడా కేటీఆర్ కు ఓ మొమెంటోను అంద‌జేశారు. ఇదిలా ఉండగా క‌రోనా లాక్ డౌన్ సమయంలో కేటీఆర్ నువ్వు రియల్ హీరో అంటూ ఓ నెటిజ‌న్ ప్రశంసించారు. అప్పుడు కేటీఆర్ రియల్ హీరో తాను కాదని సోనుసూద్ రియల్ హీరో అంటూ పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ కొనసాగింది. అప్పుడే సోను సూద్ కేటీఆర్ ను హైద‌ర‌బాద్ వ‌చ్చినప్పుడు త‌ప్ప‌కుండా కలుస్తానని చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే నేడు కేటీఆర్ తో సమావేశమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: