అయితే ఇలా నిరుద్యోగులు అందరూ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులతో కళ్లు కాయలు కాస్తున్నాయ్ తప్పా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు నిరాశలో మునిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని కేవలం ప్రిపరేషన్ లో ఉన్న ఎంతో మంది కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ తమను పెద్ద పెద్ద చదువులు చదివించిన తల్లిదండ్రులను మంచి ఉద్యోగం సాధించి బాగోగులు చూసుకోవాలి అనుకున్నవారు నోటిఫికేషన్ రాక నిరాశలో మునిగిపోతున్నారు.
ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగులు మనస్థాపం చెందుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో మరో నిరుద్యోగి ప్రాణం బలైంది. ఎం కామ్, బీఈడీ పూర్తి చేసిన ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు. దీంతో వనపర్తి జిల్లా తాడిపత్రికి చెందిన కొండలు అనే 33 ఏళ్ల వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు గురుకులం లో ఉద్యోగం సాధించి తన కలలు నెరవేర్చుకోవడమే కాదు తల్లిదండ్రులను కష్టాల నుంచి గట్టెక్కించే అని అనుకున్నాడు. కానీ చివరికి నోటిఫికేషన్ విడుదల కకపోవడంతో మనస్తాపం చెంది కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ నిరుద్యోగి.