ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. ఇప్పటకీ ప్రపంచం సైన్స్ పరంగా ఎంతో ముందుకు వెళ్లినా ఈ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం మాత్రం అంతు చిక్కడం లేదు. ఇక ఇక్కడ ఎవరైనా గ్రహాంతార వాసులు ఉన్నారా ? అన్న సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అయితే సౌతాంఫ్టన్ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ తరంగాలు 100 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని.. అందుకే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 1918 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన ఓ నౌక ఇక్కడ ప్రమాదంలో గల్లంతైంది. అప్పుడు 300 మంది చనిపోయారు.
ఇక్కడ గత 1000 ఏళ్లలో 1000 మంది మృతి చెందినట్టు అంచనా ? ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుఎస్ నావికాదళానికి చెందిన ఐదు అవెంజర్ టార్పెడో బాంబర్లు 90 నిమిషాల్లోనే ఇక్కడ మటుమాయ మయ్యాయి. ఇక్కడ ఉండే మిథేన్ హైడ్రేట్ నిల్వల వల్ల ఇక్కడ ఓడలకు తేలియాడే గుణం తగ్గి.. లోపలకు మునిగిపోతాయన్న మరో వాదన కూడా ఉంది. ఏదేమైనా ఇప్పటకీ ప్రపంచ వ్యాప్తంగా ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది పెద్ద మిస్టరీగానే ఉంది. అక్కడకు ఎవరైనా వెళ్లడమే తప్పా.. దానిని చూసి తిరిగి వచ్చిన వారు లేరు