రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు పాలు అవుతూ ఉంటాయి. అటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తూ ఉంటాయి. ఇటీవలే ఒక మహిళ ఎంపీడీవో పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఎర్రబెల్లి వ్యాఖ్యలను కారణంగా చూపుతూ అటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకు పడుతున్నాయి.  ఒక మంత్రి హోదాలో ఉండి మహిళా ఎంపీడీవొపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.




 ఇటీవలే వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్ లో నిర్వహించిన గ్రామ సభలో ఇటీవలే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అయితే ఈ సభలో పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు.  ఈ క్రమంలోనే ఇక మండలంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అక్కడ ఉన్న ఎంపీడీవో తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న ఎంపీడీవో మహిళ అని తెలిసినప్పటికీ...  ఎంపీడీవో మేడం నువ్వైతే బాగానే ఊపుతున్నావ్..  మరి ఈడ ఎందుకు ఊపుతలేవు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.




 దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఇక మహిళా ఎంపీడీవో మాత్రం మంత్రి వ్యాఖ్యలతో ఎంతో ఇబ్బంది పడింది. అయితే ఇటీవలే మంత్రి ఎర్రబెల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ స్పందించారు. మహిళా ఎంపీడీవో అని కూడా చూడకుండా సభ్యత లేకుండా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి పై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు దాసోజు శ్రవణ్ కుమార్. ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సెక్సువల్ హరాస్మెంట్ కిందికే వస్తాయి అంటూ దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. పలు చట్టాల కింద ఎర్రబెల్లి పై కేసు నమోదు చేయాలని అంతేకాకుండా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: