ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణలో కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాట.. కేసీఆర్‌కు అస‌లు తిరుగే లేదు. అయితే ఇప్పుడు లెక్క‌లు మారుతున్నాయి. టీ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రావ‌డం, అటు ష‌ర్మిల కొత్త పార్టీతో కేసీఆర్‌కు వార్ వ‌న్ సైడ్ కాద‌ని అర్థ‌మ‌వుతోంది.  ఓ వైపు ద‌ళిత ఓట్ల కోసం స‌రికొత్త వ్యూహంతో పాటు ఎప్పుడూ లేనంత‌గా ఏకంగా 50వేల ఉద్యోగ ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ వైపు రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర‌లు, యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నారు. విమ‌ర్శ‌ల దాడి ప్రారంభించేశారు. మ‌రో వైపు ష‌ర్మిల నిరుద్యోగ దీక్షల‌కు దిగుతున్నారు.

ఇక బండి సంజ‌య్ కూడా తెలంగాణ అంత‌టా పాద‌యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఒక‌రు కాదు... ఇద్ద‌రు కాదు ఏకంగా ముగ్గురు నేత‌ల‌తో కేసీఆర్ పోటీ ప‌డాల్సి ఉంది. ఇక ప‌దేళ్లుగా అధికారంలో ఉండ‌డం తో వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట కూడా వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే 2023 ఎన్నిక‌ల్లో తెలంగాణ లో కేసీఆర్‌ను ఢీ కొట్టి గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా నిల‌బ‌డేది ఎవ‌రు ? అన్న అంశంపై తాజాగా జ‌రిగిన స‌ర్వేలో అంద‌రూ ఊహించిన ఫ‌లిత‌మే వ‌చ్చింది.  కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే క‌రెక్ట్ అని భావిస్తున్నారు.

కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అని ఏకంగా 66.15 శాతం మంది చెప్పారు. బండి సంజ‌య్‌ను కేసీఆర్ కు ధీటైన ప్ర‌త్య‌ర్థిగా ప్ర‌జ‌లు భావించ‌డం లేదు. సంజ‌య్ కు కేవ‌లం 15 % ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. కేసీఆర్‌కు సంజ‌య్ ఏ మాత్రం స‌రితూగ‌ర‌ని చెప్పేశారు. ఇక ష‌ర్మిల‌కు 5 శాతం ఓట్లు కూడా రాలేదు. అస‌లు తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ ప్ర‌భావం ఏ మాత్రం ఉండ‌ద‌ని స‌ర్వే ఫ‌లితం చెప్పేసింది. ఇక ష‌ర్మిల పార్టీ ప్ర‌భావం ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, గ్రేట‌ర్‌లో కొన్ని చోట్ల మిన‌హా అస‌లు తెలంగాణ‌లో ఎక్క‌డా ఉండ‌ద‌ని చెప్పేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: