ఈ నేపథ్యంలోనే తాజాగా... జగన్ సర్కార్ కు తెలంగాణ మరో షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలపై ధిక్కరణ పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ధిక్కరణ పిటిషన్ను ఎన్జీటీలో ప్రస్తావించింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం తరఫున ఈ పిటీషన్ను ప్రస్తావించారు ఏఏజీ రామచందర్రావు. గతంలో గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ధిక్కరణ పిటిషన్ ... ఎన్జీటీలో నేడు విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపింది తెలంగాణ సర్కార్. ఇవాళే నివేదిక సమర్పించాల్సి ఉన్నా... కేఆర్ఎంబీ మరియు కేంద్ర పర్యావరణ శాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నివేదికను ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది.
అయితే... దీనిపై స్పందించిన తెలంగాణ... తనిఖీ చేయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ అడ్డుకోవడంతో నివేదిక ఇవ్వలేదని ఎన్జీటీకి తెలిపారు ఏఏజీ. స్వయంగా ఎన్జీటీనే తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన విజ్ఞప్తి చేసారు. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ ధిక్కరణ పిటిషన్లను కలిపి విచారణ జరపాలని పేర్కొన్నారు ఏఏజీ రామచందర్ రావు. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని పేర్కొన్న ఎన్జీటీ... జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.