జడ్జి ముందు ఓ వ్యక్తి సినిమా డైలాగ్ వాడి మరి రెచ్చిపోయాడు. ఢిల్లీలోని కార్కార్‌ డూమా కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సన్నీ డియోల్ డైలాగ్ 'తారెచ్ పార్ తారెచ్' ని ఉపయోగించి జడ్డి ముందు బిగ్గరగా అరిచాడు. రాకేశ్ అనే వ్యక్తి ఇలా సినిమా డైలాగ్‌ తో జడ్జి ముందు అరవడం వల్ల పోలీసులు అలర్ట్ అయ్యారు.  ఢిల్లీలోని శాస్త్రి నగర్ నివాసి అయిన రాకేశ్, 2016 నుండి ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.అలా పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి కర్కర్‌దూమా కోర్టును సందర్శించాడు. జూలై 17న కర్కర్‌దూమా కోర్టుకు వెళ్లినప్పుడు రాకేష్ ఒక్కసారిగా సినిమా డైలాగ్ తో తన మాటలను పెంచాడు. 'తారేఖ్ పార్ తారేఖ్' అనే డైలాగ్ డామిని సినిమాలోనిది. కేసు విచారణ సందర్భంగా రాకేశ్ ఆ డైలాగ్ చెబుతూ కోర్టులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. న్యాయస్థానం లోపల న్యాయమూర్తి డైస్‌ను కూడా రాకేశ్ పగులగొట్టారని పోలీసులు పేర్కొన్నారు.

రాకేశ్‌ను పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేసి, ఫర్ష్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కేసు నమోదు చేసిన తరువాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసులు సెక్షన్ 186, సెక్షన్ 353 మరియు సెక్షన్ 427, సెక్షన్ 506 ప్రకారం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే బెదిరింపులకు పాల్పడటం, అరవటం, ఇంకా అధికారులను చేయిచేసుకోవడం వంటివి చేయడం వల్ల అతడికి శిక్ష విధించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. రాకేష్ కు విపరీతమైన కోపం రావడం వల్ల తన కేసు వాయిదాలు మీద వాయిదాలు పడటం వల్ల సహజనం నశించిందని చెప్పారు. వెంటనే అతడికి వైద్యుల ఆధ్వర్యంలో మానసిక పరమైన చికిత్సను అందించాలని, అప్పటి వరకూ పోలీసులు అతడిని పోలీసు కస్టడీలోనే ఉంచాలని జడ్జి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: