పదిమంది బతకడం కోసం వారి  సర్వస్వం అయినటువంటి వ్యవసాయ భూములను,  ఇళ్లను వదులుకున్నారు. మేము భూమి ఇస్తే మిగితా రైతులకు నీళ్లు వస్తాయి అని భావించారు. దింతో ఏదుల రిజర్వాయర్కు వారి భూములను వదిలి పెట్టారు.  ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో  భాగంగా నిర్మించినటువంటి  ఎదుల రిజర్వాయర్లో  మునిగిపోతున్న టువంటి బండరాణిపాకుల  గ్రామస్తులకు  గౌరీదేవిపల్లి గ్రామ సమీపంలో ఆర్ అండ్ ఆర్  సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. బండారనిపాకులలో ప్రజలకు ప్లాట్లను పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు.

63ఎకరాలలో ఆర్అండ్ ఆర్ సెంటర్ 50 ఎకరాలలో ప్లాటింగ్ పూర్తయినది అన్నారు. 27 కోట్ల రూపాయలతో అక్కడ అన్ని వసతులతో భవనాలు నిర్మించి ఇస్తామని తెలిపారు. గ్రామాలతో సర్వం కోల్పోయిన ప్రజలకు భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోబోయే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలలో గ్యారెంటీ లేకుండా లోన్లు సదుపాయం కల్పిస్తామని, ఏదుల రిజర్వాయర్ లో ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రమే చేపలు పట్టే హక్కులు కల్పిస్తామని  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ప్రాజెక్టులో ముంపునకు గురైన బాధితులకు  ఏ విధంగా అయితే పరిహారం ఇస్తున్నారో ఇక్కడ కూడా అంతే ఇస్తామని అన్నారు. అలాగే చివరకు దరఖాస్తు చేసుకున్నటువంటి 167 మంది కి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 318 ఇల్లు  ప్లాట్లు వద్ద ఉన్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. న్యాయబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీంతోపాటుగా మండల స్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కమిటీలకు ఎట్టి శాశ్వత సభ్యులుగా పరిగణించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన జారీ చేశారు. ఏదుల రిజర్వాయర్ బాధితులను ఎల్ల వేళలా ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయాన్ని నిర్వాసితులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: