మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం... చెప్పగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. అయితే ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందు కే... అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. ఈ ప్రచారంలో బిజెపి, అధికార టీఆర్ఎస్ పార్టీలు మంచి దూకుడు పై ఉన్నాయి. అయితే... తాజాగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 

బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి.. హుజురాబాద్ లో జరుగుతున్న పరిణామాలపై అలకతో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది.. తనకు సమాచారం ఇవ్వకుండానే పార్టీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అసంతృప్తి చేసిన పెద్దిరెడ్డి... ఇవాళ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ కు పంపారు. ఇప్పటి వరకు బీజేపీ పార్టీలో తనకు సహకరించిన.... నాయకులకు కృతజ్ఞతలు అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు పెద్దిరెడ్డి.

 కాగా... మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి పెద్ది రెడ్డి అసంతృప్తిగా ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈటల రాజేందర్‌ కారణంగానే ఇనుగాల పెద్ది రెడ్డి... బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన శిబిరంలో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఇటీవలే హన్మకొండలో టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌  తో పెద్దిరెడ్డి భేటీ అయినట్లు సమాచారం అందుతోంది. ఇక బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఇనుగాల పెద్ది రెడ్డి... టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని హుజురాబాద్‌ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా.. పెద్దిరెడ్డి రాజీనామా.. బీజేపీకి పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp