ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వైసీపీ ఎంపీలు అందరూ ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. మరి, ఇటువంటి సమయంలో రఘుపతి ఒక్కరే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డిని కలవడంలోదాగి ఉన్న విషయం ఏమిటనే చర్చ జరుగుతుంది. నిజంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికే వెళ్లినట్లయితే అక్కడే ఉన్న ఎంపీలను కూడా తీసుకువెళ్ళాలి కదా అనే సందేహం అందరిలో మొదలుయింది. అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రిని కలిసిన విషయం కూడా ఎవ్వరికీ తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచారు. కిషన్ రెడ్డి యొక్క పీ ఆర్ టీమ్ ఫొటోను విడుదల చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. లేదంటే గోప్యం గానే ఉండేడట .
ఈయన మాత్రమే కాకుండా మరికొందరు వైసీపీ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికార పార్టీ బీజేపీ పెద్దలను కలుస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ మధ్య మంత్రి బొత్స సత్యన్నారాయణ కూడా ఇలాగే ఢిల్లీ వెళ్లి తాను అనుకున్న వారందరినీ కలిసి వచ్చినట్లు సమాచారం. మీడియాకు కూడా తెలియకుండా వెళ్లి కలవాల్సిన అవసరం ఏమిటన్న విషయం పై చర్చ జరుగుతున్నది వైసీపీలోనూ ఈవిధమైన చర్చ సాగుతున్నట్లు సమాచారం అందింది.
మరి, ఇలా వీళ్లందరూ గోప్యంగా వెళ్లి బీజేపీ నేతలను కలిసి రావడం ఏంటనే ప్రశ్న అయితే వస్తుంది. పార్టీ హై కమాండ్ కు తెలిసి వెళ్తున్నారా? సొంతంగానే ఎవరికీ వారే వెళ్లివస్తున్నారా? అన్నది మరో తెలియాల్సి ఉంది. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.