ఇటీవలే భారత్లో ఎంతో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకున్నారు అందరూ. కార్గిల్ యుద్ధంలో భారత రక్షణ కోసం వీర మరణం పొందిన సైనికులందరి త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకున్నారు. అంతేకాదు కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. భారత సైనికులు వీరోచితంగా పోరాడిన తీరును  నెమరు వేసుకున్నారు. అయితే ఇటీవలే కార్గిల్ ప్రాంతంలో జరిగిన సంఘటన సంచలనం గా మారిపోయింది.  ఏకంగా కార్గిల్ ప్రాంతంలో తుపాకీ శబ్దాలు, యుద్ధ విమానాల శబ్దాలు వినిపించడంతో పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఒక్కసారిగా పెరిగిపోయింది.



 అసలు కార్గిల్ ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి.. ఇక వెంటనే పాకిస్థాన్ సైన్యం ఉన్నతాధికారులకు దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించింది. ఇక ఆ తర్వాత ఇక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు భారత ఆర్మీ ని సమాచారం అడిగారు. అయితే కార్గిల్ ప్రాంతంలో భారత ఆర్మీ యుద్ధానికి ఏమి సిద్ధం కాలేదని ఇక కాల్పులు కూడా జరపడం లేదు అంటూ స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ.  మరి ఇప్పటి వరకు వచ్చిన భయంకర శబ్దాలు ఎక్కడివి అని ప్రశ్నించగా.. కార్గిల్ ప్రాంతంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అంటూ తెలిపింది  భారత ఆర్మీ.



 షేర్ షా అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ కు  కార్గిల్ ప్రాంతంలో జరుపుకునేందుకు  పర్మిషన్ ఇచ్చామని ఇక వాళ్ళు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ సినిమా షూటింగ్ కి అటు భారత సైన్యం కూడా పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుంది అన్న విషయాన్ని వెల్లడించింది. ఇలా సినిమా షూటింగ్ కు వచ్చిన శబ్దాలతో నే పాకిస్తాన్ ఆర్మీ భయపడిపోయింది.  ఎప్పుడూ తాము భారత్ కంటే ఎంతో దృఢమైన రక్షణ రంగాన్ని కలిగి ఉన్నాము అంటూ మేకపోతు గాంభీర్యాన్ని  ప్రదర్శించే  పాకిస్థాన్ ఇటీవలే షూటింగ్ సందర్భంగా వచ్చిన బాంబు పేలుళ్లు యుద్ధ విమానాలు వణికిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: