ఇక 2004వ సంవత్సరం ఒబామా జీవితంలో మరిచిపోలేనిది. ఎందుకంటే.. అమెరికా సెనేట్ ఎలక్షన్స్ లో ఆయన ఊహించని విజయం సాధించారు. దీంతో అమెరికా దేశం దృష్టిలోనే కాదు.. ప్రపంచం దృష్టిలో పడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో కలిసిపోయారు. తాను చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతీ ఒక్కరికీ తాను చేయబోయే పనులను పూసగుచ్చినట్టు చెప్పారు. ఇంకేముందీ ఆయన ప్లాన్ వర్కవుట్ అయింది. డెమెక్రటిక్ పార్టీ తరఫున ఊహించని విజయం సాధించారు. ఆ తర్వాత డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఒబామా చేసిన ప్రసంగం అన్నివర్గాల ప్రజలను వివరీతంగా ఆకట్టుకుంది.
ఇక 2007వ సంవత్సరంలో ఒక ప్రెసిడెంట్ గా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ఆయన.. తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పైనే పై చేయించి సాధించారు. అధ్యక్ష పదవికి టికెట్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మైక్ కైన్ ను ఓడించేశాడు. 2009సంవత్సరం జనవరి 20వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఎప్పుడై ఆ దేశానికి అధ్యక్షుడయ్యారో.. ఆ తర్వాత తొమ్మిది నెలలకు నోబెల్ శాంతి బహుమతి పొందారు.
అంతర్జాతీయంగా దౌత్యం... ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించేందుకు బరాక్ ఒబామా తీవ్రంగా తీవ్రంగా కృషి చేశారు. అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం తహతహలాడారు. అంతేకాదు ప్రజలు అతి తక్కువ ఖర్చుతో వైద్యసేవలు పొందేందుకు ఒక ఆరోగ్య చట్టాన్ని తీసుకొచ్చారు. అదే ఒబామా కేర్.
ఒబామా ప్రెసిడెంట్ అయ్యారే కానీ.. ఆయన ఎప్పుడు గర్వాన్ని.. అహంకారాన్ని ప్రదర్శించలేదు. బయటకు ఎక్కడికి వెళ్లినా.. సాధారణ వ్యక్తిలా కనిపించారు. ప్రజల్లో కలిసిపోయారు. పార్క్ లకు వెళ్లినా.. హోటల్ కు వెళ్లినా అక్కడున్న వారితో సరదాగా గడిపారు. వారి సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించేవారు. అలా ఆయన ప్రజాధరణ పొందారు. అదే ఆయన్ను రెండు సార్లు అధ్యక్ష పీఠం ఎక్కేలా చేశాయి.