ఏపీలో మొత్తం 25 మంది ఎంపీలు లోక్‌భకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు విజయం సాధించగా... విపక్ష టీడీపీ నుంచి ముగ్గురు విజయం సాధించారు. టిడిపి నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు వరుసగా రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇలా ఉంటే ఏపీ ఎంపీల పనితీరుపై తాజాగా పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసెర్చ్ సంస్థ అధ్య‌య‌నం చేసింది. ఈ అధ్య‌య‌నంలో ఏ ఎంపీ ప‌నితీరు ఎలా ?  ఉంద‌న్న‌దానిపై ఓ నివ‌వేదిక కూడా రిలీజ్ చేసింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థ స‌ర్వేలు చేస్తుంద‌న్న పేరుంది. వైసీపీ ఎంపీల్లో జ‌గ‌న్ క‌జిన్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ప‌నితీరు దారుణంగా ఉంద‌ని స‌ర్వేలో తేలింది.

లోక్‌స‌భ‌లో ఆయ‌న హాజ‌రు కేవ‌లం 30 శాతం మాత్ర‌మే. అంటే 100 రోజులు లోక్‌స‌భ జ‌రిగితే ఆయ‌న కేవ‌లం 30 రోజులు మాత్ర‌మే అటెండ్ అవుతున్నారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీల‌లో అవినాష్ హాజ‌రే చాలా త‌క్కువ‌. ఈ విష‌యంలో ఆయ‌న లీస్ట్‌లో ఉన్నారు. అయితే ఆయ‌న హాజ‌రు త‌క్కువుగా ఉన్నా ఆయ‌న ప్ర‌శ్న‌ల్లో టాప్‌లో ఉన్నారు. ఆయ‌న ఏకంగా 146 ప్ర‌శ్న‌లు లోక్‌స‌భ‌లో వేశారు. ఇందులో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ధి గురించి ఎక్కువ ఉన్నాయి. ఇక బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ పెర్పామెన్స్ చాలా ఘోరంగా ఉంద‌ని నివేదిక చెప్పేసింది.

నందిగం హాజ‌రు విష‌యంలో అవినాష్‌తో పోలిస్తే కాస్త బెట‌ర్‌గా ఉన్నా కేవ‌లం ఒక్క డిబేట్లో మాత్ర‌మే ఆయ‌న పాల్గోన్నార‌ట‌. ఇక మ‌హిళా ఎంపీలుగా ఉన్న డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి, గొడ్డేటి మాధ‌వి, చింతా అనూరాధ కూడా ఏదో పార్ల‌మెంటుకు వెళ్లాం అంటే వెళ్లాం అన్న‌ట్టుగానే ఉంటున్నారే త‌ప్పా వీరి వేసిన ప్ర‌శ్న‌ల వ‌ల్ల కూడా ఉప‌యోగం లేద‌ని తేల్చేసింది. ఇక వైసీపీ రెబల్ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు మాత్రం హాజ‌రు లో రికార్డు క్రియేట్ చేశారు. ఆయ‌న హాజ‌రు శాతం ఏకంగా 96. ఏపీలోనే ఆయ‌న టాప్‌లో ఉన్నారు.

ఆయ‌న 50 డిబేట్ల‌లో పాల్గొని 145 ప్ర‌శ్న‌లు వేశారు. విప‌క్ష టీడీపీకి చెందిన ఎంపీల్లో గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ 89 శాతం హాజ‌రుతో 133 ప్ర‌శ్న‌లు వేశారు. ఇక మ‌రో టీడీపీ ఎంపీ, విజ‌య‌వాడ‌కు చెందిన కేశినేని నాని సైతం జ‌య‌దేవ్‌కు ధీటుగా అటు హాజ‌రులోనూ, ఇటు ప్ర‌శ్న‌లు వేయ‌డంలోనూ ముందు ఉన్నారు. ఇక మ‌రి కొంద‌రు ఎంపీలు అస‌లు పార్ల‌మెంటుకు ఎప్పుడు వెళుతున్నారు ? ఎందుకు వెళుతున్నారో ?  తెలియ‌ని ప‌రిస్థితి. చాలా మంది మాత్రం త‌మ వ్యాపార వ్యవ‌హారాలు చ‌క్క పెట్టుకోవ‌డానికే ఈ ఎంపీ ప‌ద‌వి వాడుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: