పోడు రైతుల పై  అక్రమ కేసులు  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు గడిచినా అడవిని నమ్ముకుని  వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న  ఆదివాసి, గిరిజన రైతుల బతుకులు ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో 26 జిల్లాలలో గిరిజన పోడు వ్యవసాయం జరుగుతోందని, 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 వరకు భూమిపై సాగు చేసుకుంటున్న రైతుకు హక్కు పత్రాలు మూడు తరాలు గా గుర్తించి పట్టాలు అందజేయాలని, ఈ చట్టం ఆధారంగా  అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం దాదాపు  2,41,816 మంది  గిరిజనులు తరతరాలుగా సాగుచేసుకుంటున్న 6,96,018 ఎకరాలలో గిరిజనుల అక్రమంగా సాగు చేసుకుంటున్నారని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు నిత్యం వారిని వేధింపులకు గురి చేస్తున్నారని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ కార్యకర్తలు చేసి అక్రమ పోడు వ్యవసాయానికి వత్తాసు పలుకుతూ నిజమైన ఆదివాసి, గిరిజన రైతుల వేధిస్తోందని మండిపడ్డారు. పోడు రైతుల పై పోలీసులు ఫారెస్టు రెవెన్యూ అధికారులు హద్దుల పేరుతో లోతైన తవ్వకాలు తవ్వించి సాగు భూమి నిరుపయోగంగా మారుస్తున్నారు అని అన్నారు. వారి చేతికందిన పంటను నాశనం కూడా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోడు సాగు రైతు ఆదివాసీ గిరిజన బిడ్డలకు  సిపిఐ  అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, జిల్లాలో ఆదివాసీ గిరిజన  పోడు సాగు రైతులకు అండగా నిలిచిన సిపిఐ కార్యకర్తలపై నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పై సాగిస్తున్న అనిశ్చితి వల్ల  ఆదివాసీ ప్రాంతాల్లో తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారని తెలియజేశారు.

 ఈ ఆపద సమయంలో రైతులకు అండగా నిలుస్తూ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసి గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు రైతులను ఆదుకోవాలని, వారిని ఇబ్బంది పెట్టకూడదని తెలియజేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం భూమి వారికే చెందుతుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: