ఆ తర్వాత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో చివరకు వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి ఆ బాలికతో తెగదెంపులు చేసుకున్నాడు. ఆ తర్వాత 14 ఏళ్ల వయసు ఉన్న మరో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి వాడుకున్నాడు. ఆమెను కూడా తెలివిగా ముగ్గులో దింపాడు. ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో శారీరక సంబంధం కొనసాగిస్తూనే 17 ఏళ్ల వయసున్న మరో బాలికను కూడా వలలో వేసుకున్నాడు. ఇలా ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికతో ప్రేమాయణం కొనసాగిస్తున్న అతడి గుట్టును మూడో బాలిక రట్టు చేసింది.
తనను మోసం చేస్తున్నాడని గ్రహించి ఇంటికి వెళ్లి నిలదీసింది. అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆ బాలుడు కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది. ఈ కేసులో అందరూ మైనర్లు కావడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.