ఆఫ్ఘనిస్థాన్‌లో మొన్నటి వరకు ఉన్న అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ల అరాచకంకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడికే దేశంలోని ఎన్నో ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు. ఈ క్రమంలోనే ఇక ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు అటు అమెరికా చైనా రష్యా దేశాలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాయి. అయితే ఈ చర్చలకు అటు భారత్‌ను మాత్రం దూరం పెడుతూ వస్తున్నాయి ఈ మూడు దేశాలు. ఆఫ్ఘనిస్తాన్ కి భారత్ కి మధ్య ఎంతో బంధం ఉందని ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ ఎంతో చేసింది అని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈ మూడు దేశాలు భారత్‌ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే భారత్ కూడా తమ మద్దతును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భారత్ రష్యా చైనా దేశాలు అటు ఇరాక్ ని కూడా పక్కన పెడుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాక్ తో కలిసి భారత్ ఆఫ్ఘనిస్థాన్ సమస్యపై చర్చించేందుకు సిద్ధం అయింది. ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇరాక్ ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు. ఇటీవల కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకరం చేశారు. ఈ క్రమంలోనే జయశంకర్ ఇరాక్ ఈ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జయశంకర్ ఇరాక్ కు వెళ్ళిన కొన్ని రోజుల్లోనే భారత్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సమస్య పరిష్కరించలేము అంటూ ఇరాక్ అధ్యక్షుడు ప్రకటన చేయడం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇలా ఇరాక్ భారత్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.