మాములుగా సంవత్సరం సంవత్సరానికి మన దేశంలోని ధనవంతుల జాబితాలో మార్పులు వస్తుంటాయి. ఈ సంవత్సరం ఒక స్థానంలో ఉన్న వారు వచ్చే సంవత్సరానికి ఆ స్థానానికి తగ్గి ఉండొచ్చు లేదా పెరగొచ్చు చెప్పలేము. ఇదంతా కూడా వారి యొక్క ఆదాయాన్ని బట్టి ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ధనవంతులు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా బిలియన్ కోట్ల సంపదను కలిగి ఉన్నారు. సంబంధిత సంవతసరంలో వంద కోట్లకు పైగా ఆదాయం కలిగి ఉన్న వారిని బిలియనీర్లు గా పరిగణిస్తారు. గత సంవత్సరం వరకు మన దేశంలో ఉన్న బిలియనీర్ల సంఖ్య 141 గా ఉండేది. కానీ గడుస్తున్న సంవత్సరానికి ఈ బిలియనీర్లు వేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆధారంగా చూస్తే ఆర్ధిక శాఖ అధికారులు షాక్ తిన్నారట.
గతంలో కన్నా ఈ సంవత్సరం బిలియనీర్ల సంఖ్యలో తగ్గుదల కనిపించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం బిలియనీర్ల సంఖ్య 136 గా ఉంది.  ఈ విషయాన్ని స్వయంగా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో తెలియచేశారు. ఈ విషయంపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఎందుకు గత సంవత్సరం కన్నా 5 మంది బిలియనీర్లు తగ్గారు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. మాములుగా అయితే 2016 సంవత్సరం తర్వాత వారి సంపద యొక్క పన్నును రద్దు చేసింది. కావున కొంతమంది యొక్క పూర్తి ఆదాయానికి సంబంధించిన వివరాలు సీబీడీటీ వద్ద లేవని తెలుస్తోంది. ఇది కూడా కుబేరుల జాబితా తగ్గడానికి కారణమని తెలుస్తోంది.  

ఇది కాకుండా గత సంవత్సరం నుండి కరోనా మహమ్మారి దేశ ప్రజలందరినీ ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతోంది. ప్రజలను కరోనా వ్యాప్తి నుండి కాపాడడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ కారణంగా పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఇది కూడా దేశంలో బిలియనీర్ల సంఖ్య స్వల్పంగా తగ్గడానికి కారణం అయి ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత పరిస్థితి కొంతమేర కుదుటపడి అన్ని రంగాలు యాక్టీవ్ అయ్యాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: