ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను విభజించిన సమయంలో కేంద్రం రెండు రాష్ట్రాలకు కొన్ని హామీలు ఇచ్చింది. వాటిలో విద్యాసంస్థలకు ఇచ్చిన హామీలు కూడా కీలకమైనవే.. మరి అవి అమలు అయ్యాయా.. ఏపీ, తెలంగాణ విద్యాసంస్థలకు కేంద్రం ఎంత ఇచ్చింది.. వాటి వివరాలేంటి.. ఇదే సందేహం వచ్చిన ఓ వ్యక్తి కేంద్రాన్ని ఆర్టీఐ ద్వారా ప్రశ్నించాడు. దానికి కేంద్రం సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేస్తున్న మూడు ప్రఖ్యాత విద్యాసంస్థలు ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎస్‌ఈఆర్‌లకు ఇప్పటి వరకు 1454 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వివరాలు ఇచ్చింది.


ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎస్‌ఈఆర్‌ ల ఏర్పాటు కోసం అంచనా వ్యయం 3099.29 కోట్లు.. అందులో 46.89 శాతం ఇచ్చామని కేంద్రం తెలిపింది. తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌కు మూలధన వ్యయం 1137.16 కోట్లుగా ఉంటే.. నిర్వహణ ఖర్చులకు 354.18 కోట్లు కలిపి 1491.34 కోట్లుగా అంచనా వేశారట. దీనికి ఇప్పటివరకు 33.17శాతం అంటే.. 494.80 కోట్లు ఇచ్చిందట కేంద్రం.. అలాగే  తిరుపతి ఐఐటికి 1074.40 కోట్లకు  49.18శాతం అంటే.. 528.42 కోట్లు ఇచ్చిందట కేంద్రం.. అలాగే తాడేపల్లిగూడెం వద్ద నెలకొల్పుతున్న ఎన్‌ఐటికి 533.55 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటి వరకూ 80.64శాతం అంటే 430.29కోట్లు ఇచ్చినట్లు కేంద్రం సమాధానం చెప్పింది.


ఇక ఎన్‌ఐటి 604 మంది విద్యార్దుల ఇన్‌టేక్‌ సామర్ధ్యంతో ప్రస్తుతం శాశ్వత భవనంలో కొనసాగుతోందట. తిరుపతి ఐఐటి 2019-20లో ఇన్‌టేక్‌ 191 మందితో ఇన్‌టేక్‌ సామర్ధ్యంతో తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తుందట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారట. కానీ.. తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేయడంతో సంస్థలు నెలకొల్పడం ఆలస్యం అయ్యిందని కేంద్రం చెబుతోంది.


ఏపీలో కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని చెప్పిన కేంద్రం.. ఏపీతోపాటు గిరిజన యూనివర్సిటీ ప్రారంభించినా.. రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేసిందట. ములుగు జిల్లాలో 512.47 ఎకరాల భూమిని చూపడంతో కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటి పరిశీలించిందట. కానీ.. అప్పటికే అక్కడ ఉన్న ఆక్రమణలను మాత్రం తొలిగించలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: