అయితే ఇక చెల్లి అన్నకు కట్టే రాఖీ కి ఎంతో పవర్ ఉందని కూడా చెబుతూ ఉంటారు. ఒకసారి ఇక చేతికి రక్షాబంధనం కట్టిన తర్వాత ఇక ఆ చెల్లికి తోడునీడగా ఎలాంటి సమస్య వచ్చినా రక్షగా అన్న ఉండాలి అనే దానికి రాఖీ గుర్తు గా నిలుస్తుంది అని అంటూ ఉంటారు. అయితే అప్పట్లో రాజుల కాలంలో కూడా రాఖి కి ఎంతో విలువ ఇచ్చే వారు అన్నది ఇటీవలే ఒక ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఏకంగా యుద్ధం సమయంలో భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక మహిళ రక్షాబంధన్ ప్రత్యర్థి రాజుగా ఉన్న వ్యక్తికి రాఖీ కట్టిందట. ఇలా రాఖీ కట్టినందుకు ఏకంగా శత్రువును సైతం వదిలేశారట.
దీనికి సంబంధించిన స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గ్రీకు చక్రవర్తి గా ప్రపంచాన్ని అలెగ్జాండర్ ఎంతలా గడగడలాడించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రపంచంలోని ఎన్నో రాజ్యాలను సైతం తన వశం చేసుకుంటూ యుద్ధంలో గెలుచుకుంటూ పోయాడు. అయితే ఒకానొక సమయంలో అలెగ్జాండర్ యుద్ధంలో ఓడిపోయే సమయం వచ్చింది. ఇక ప్రాణాలు కూడా పోతాయి అనుకుంటున్న సమయంలో అలెగ్జాండర్ భార్య ఏకంగా అతని ప్రాణాలను కాపాడింది. అలెగ్జాండర్ భారత్ ఫై దండయాత్ర చేసిన సమయంలో ఇక పురుషోత్తముడు అలెగ్జాండర్ తో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తన భర్తను చంపొద్దు అని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినప్పటికీ ఇక అలెగ్జాండర్ను చంపకుండా వదిలేస్తాడు.