అయితే బండి సంజయ్ పాదయాత్ర ఆగస్టు 9వ తేదీన ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక అప్పుడు పాదయాత్ర వాయిదా వేసి ఆగస్టు 24వ తేదీన నేడు పాదయాత్ర ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి మాత్రం రాలేదు అన్నది తెలుస్తుంది. మొదట ఇక పాదయాత్ర అనుమతి కోసం డీజీపీ మహేందర్ రెడ్డికి బిజెపి శ్రేణులు లేక పంపినప్పటికీ అనుమతి రాలేదట. ఈ క్రమంలోనే ఇక బండి సంజయ్ పాదయాత్రలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయ్ అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.
సాధారణంగా అటు అధికార పార్టీ ఎప్పుడూ ప్రతిపక్షాల సభలకు, పాదయాత్రలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వదు. ఇక ఇప్పుడు కూడా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర విషయంలో ఇదే చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమతి లేకపోవడంతో ఇక బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇక బిజెపి నేతలను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాదయాత్రకు ఆదిలోనే ఆటంకం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.