కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పీఆర్ టీయూ కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది ఒక మంచి దృక్పథం అంటూ ఓటర్ల‌కు హిత‌బోద చేశారు. పీఆర్సీని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని హ‌రీష్ రావు అన్నారు. కరోనా వల్ల కొంత ఆలస్యం జరిగిందని అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కు ఒక్కసారి పీఆర్సీని ఏడున్నర శాతం ఇస్తే...  తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల కే 30 శాతం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఎక్కువ జీతాలు, పీఆర్సీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అంటూ హ‌రీష్ రావు అన్నారు. 

గతం లో కరెంట్, మంచినీళ్ల గురించి శాసనసభ సమావేశం మొదటి రోజుల్లోనే నిరసన ఉండేదని.. ఇప్పుడు అలాoటి సమస్యలు ఉన్నాయా..? అంటూ ప్ర‌శ్నించారు. మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి కరెంట్ అమ్ముతున్నామ‌ని హ‌రీష్ రావు అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హ‌రీష్ రావు చెప్పారు. రోడ్ల వ్యవస్థ ను మెరుగు పర్చామని..వడ్లు అత్యధికంగా పండించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన ఘనత తెలంగాణదేన‌ని హ‌రీష్ రావు చెప్పారు. గతంలో తెలంగాణ వృద్ధి 5 శాతం నుండి 9 శాతం కు పోయామ‌ని ట్ర‌బుల్ షూట‌ర్ తెలిపారు. భారత దేశంలో మన తెలంగాణ వృద్ధి మూడో స్థానంలో ఉంద‌న్నారు. కొత్త జిల్లాలు... ఐటి పార్క్ ల తో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.  

ఈటెల రాజేందర్ దేని కోసం రాజీనామా చేశారని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. వ్యక్తి కోసం ఉంటారా! వ్యవస్థ కోసం ఉంటారా..? అంటూ ప్ర‌శ్న‌లు కురిపించారు. హుజురాబాద్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని, రాజేందర్ గెలిస్తే, ఆయనకు బీజేపీ కి లాభమ‌ని చెప్పారు. టిఆర్ ఎస్ ను గెలిపిస్తే హుజురాబాద్ కు లాభమ‌ని...ప్రజలు, మేధావులు గ్రహించాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల‌ని పేదలు, సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమ‌ని హ‌రీష్ రావు అన్నారు. కుట్టు మిషన్లు, కుంకుమ భరణి, బొట్టు బిల్లలు ఇవ్వడం ఈటెల ఆత్మ గౌరవం అంటారా.?? అంటూ ప్ర‌శ్నించారు. అన్ని అమ్ముతున్న బీజేపీ చివరకు గాలిని కూడా అమ్ముతుందేమోన‌ని విచారం వ్య‌క్తం చేశారు. మోడల్ స్కూల్లను బీజేపీ నాశనం చేస్తే టిఆర్ఎస్ కాపాడింద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: