హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే... చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది.  ఇప్పటికీ అన్ని పార్టీలు గ్రామస్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో అధికార టీఆర్ఎస్ పార్టీ... దూకుడుగా వ్యవహరిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించి... ఓటర్లను తమ వైపు నకు  తిప్పు కుంటుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలను...తమ వైపునకు లాగేసుకుని మరింత బలపడే దిశగా అడుగులు వేస్తోంది టీఆర్ఎస్ పార్టీ.

ఇందులో భాగంగానే ఇప్పటికే కౌశిక్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి లాంటి కీలక నేతలను... టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లోని ఈటెల రాజేందర్ అనుచరులతో నామినేటెడ్ పదవుల ఎర చూపుతోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇక అటు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరినీ ప్రచారంలో దించారు. ఇదిలా ఉండగా... హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఢీ కొట్టేందుకు సీఎం కేసీఆర్... దళిత బంధు మరియు ఇతర ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ... ప్రజల్లో సానుకూలత రావడం లేదని సమాచారం అందుతోంది. ఇటీవల చేసిన సర్వేల్లో ఈ విషయాన్ని గమనించారట.

దీనంతటికీ కారణం సొంతపార్టీ నేతలే అని సీఎం కేసీఆర్ సర్వేలో తేలిందట. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను మరియు దళిత బంధు లాంటి స్కీమ్ లను ప్రజల్లోకి దీటుగా తీసుకుపోవడం లేదట. ఖరీదైన కార్లలో హుజూరాబాద్ నియోజకవర్గం లో చక్కర్లు కొడుతున్నారట. కానీ వీధివీధి తిరిగి ప్రచారం చేయడం లేదట టిఆర్ఎస్ నాయకులు. ఖరీదైన కారులలో... వస్తూ... బస్టాండు మరియు గ్రామపంచాయతీ లాంటి స్థలాల్లో నే నాయకులు ప్రచారం చేస్తున్నారట. అసలు ప్రజల మధ్యకు వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ చేసిన సర్వేలో తేలిందని సమాచారం. అయితే దీనిపై గులాబీ బాస్ కూడా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట గులాబీ బాస్. ఖరీదైన కార్లు వదిలి కాలినడకన వీధుల్లో తిరగాలని ఆదేశాలు జారీ చేశారట సీఎం కేసీఆర్. దీంతో నేతలు... కార్ల ను వదిలి వీధుల్లో తిరగాలని ఆలోచన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: