హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తోంది. అభ్యర్థి ఖరారు కు సంబంధించి పిసిసి చేస్తున్న కసరత్తుపై ఆ పార్టీలోని కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటిదాకా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ఖరారు అయిందని ప్రచారం జరిగినా ఆమె మాత్రం పోటీకి ససేమిరా అంటున్నట్లు సమాచారం. హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి గత సోమవారం గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అభ్యర్థి ఎంపికపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉప ఎన్నికకు పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి,పిసిసి ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ముగ్గురి పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. వరంగల్ కు సమీపంలో హుజరాబాద్ నియోజకవర్గం ఉండడంతో ఉప ఎన్నికల్లో కొండా సురేఖ ను పోటీకి పెడితే బాగుంటుందన్న ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించారు. స్థానిక నేతలు కాకుండా ఇతర జిల్లాల వారిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టడం వల్ల ఈ నియోజకవర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని గుర్తించారు.

దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థి ఎంపికపై ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, ఆ తర్వాత వాటిని వడపోసి ముగ్గురు పేర్లతో పీసీసీ కి నివేదిక ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్  ఆదేశించారు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం ఉన్నవారు ఆదివారం సాయంత్రం లోపు దరఖాస్తు చేయాలని ఇందుకు రూ.5000 రుసుం చెల్లించాలని కోరారు పీసీసీ  చేసిన అభ్యర్థనను కొండా సురేఖ సున్నితంగా తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: