
ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసింది వాతావరణ శాఖ. వాగులు,చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు చేసింది వాతావరణ శాఖ. ఇక అటు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ & హనుమకొండ కలెక్టరేట్ లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది వాతావరణ శాఖ.
వరంగల్ 915452937, 1800 425 3424 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయగా.... హనుమకొండ లో 1800 425 1115 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు తెలంగాణ అధికారులు. ఇక అటు సిరిసిల్ల పట్టణంలో వర్షం భీభత్సం సృష్టించింది. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో నీట మునిగాయి పలు ప్రాంతాలు. సిరిసిల్ల అర్బన్ చిన్న బోనాల చెరువు తెగడంతో పట్టణంలోని వెంకంపేట, అశోక్ నగర్, పద్మానగర్, శాంతినగర్, పాతబస్టాండ్, పెద్దబజార్ తథితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్ళలోకి, రోడ్లపై మోకాలు లోతు నీరు రాగా... నదిని తలపిస్తున్నది సిరిసిల్ల- కరీంనగర్ రహదారి. దీంతో సిరిసిల్లా పట్టణానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృంధాలు చేరుకుంటున్నాయి.