అయితే వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే 2012 ప్రత్తిపాడు ఉపఎన్నికలో సుచరిత వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి గెలిచింది. టిడిపి తరుపున రావెల కిషోర్ బాబు, సుచరితపై గెలిచారు. అలాగే రావెల అప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసి మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల ముందు రావెల టిడిపిని వీడి జనసేనలో చేరారు. దీంతో టిడిపి తరుపున డొక్కా మాణిక్యవరప్రసాద్ పోటీ చేశారు. అటు వైసీపీ నుంచి సుచరిత, జనసేన నుంచి రావెల పోటీ చేశారు.
ఈ త్రిముఖ పోరులో సుచరిత 7 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచారు. అలాగే జగన్ క్యాబినెట్‌లో హోమ్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక హోమ్ మంత్రిగా సుచరిత పనితీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆమె ఒక డమ్మీ మంత్రి అని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తూనే ఉంది.
ఇక ఎమ్మెల్యేగా ప్రత్తిపాడులో సుచరితకు చెక్ పెట్టాలని టిడిపి గట్టిగానే ప్రయత్నిస్తుంది. డొక్కా కూడా వైసీపీలోకి వెళ్ళడంతో మళ్ళీ సీనియర్ నాయకుడు పెద రత్తయ్యని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయన కాస్త దూకుడు తక్కువగా ఉన్న, కింది స్థాయి నాయకత్వం యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఎలాగైనా సుచరితకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. పైగా రాజధాని అంశం టిడిపికి కలిసొచ్చేలా ఉంది. ఏదేమైనా ఈ సారి సుచరితకు అంత సులువుగా గెలుపు దక్కడం కష్టమే అని తెలుస్తోంది.