కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అమ్మేస్తూ చేతులు దులుపుకుంటున్న సంగతి తెలిసిందే. బిజినెస్ చేయడం ప్రభుత్వం పని కాదని చెబుతూ ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటుకు అప్పగిస్తుంది. గతంలోనూ ప్రభుత్వాలు ప్రైవేటుకు ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పటికీ కేవలం వాటాలను మాత్రమే ఇస్తూ ప్రభుత్వ ఆస్తులను కాస్తోకూస్తో కాపాడే ప్రయత్నం చేశాయి. కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నం జరగడం లేదు. కుదిరితే లీజుకు ఇవ్వడం వీలైతే అమ్మకం అంటూ బోర్డులు పెట్టేస్తోంది.

ఇక కేంద్రం తీరుపై ప్రజలు, మేధావులు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా తమ రూటే సపరేటు అంటూ ముందుకు వెళుతుంది. ఇక ఈ అమ్మకాలు ఏంటి బాబోయ్ అంటూ ప్రశ్నిస్తే వాళ్ళను దేశ ద్రోహుల కింద లెక్క కట్టేస్తున్నారు. రోడ్లు, రైల్వే , ఎయిర్వేస్ అన్నింటిని కేంద్రం అమ్మకానికి పెడుతోంది. ఇక తాజాగా మోడీ సర్కార్ మరో13 ఎయిర్ పోర్ట్ లను కూడా అమ్మకానికి పెట్టింది. అందులో పెద్దవి మరియు చిన్నవి కూడా ఉన్నాయి. అమ్మకానికి పెట్టిన  ఎయిర్ పోర్ట్ లలో ఆరు పెద్ద ఎయిర్ పోర్ట్ లు కాగా 7 చిన్నవి ఉన్నాయి. అయితే చిన్న వాటిని కలిపి పెద్ద ఎయిర్ పోర్టులు గా మార్చబోతున్నట్టు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన మానిటైజేషన్ ప్లాన్ కు ఇది అదనం అని చెబుతున్నారు. ఇక కేంద్రం అమ్మకానికి పెట్టిన 13 ఎయిర్ పోర్టులలో వారణాసి, అమృత్ సర్, భువనేశ్వర్ ఇండోర్, రాయ్పూర్ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి.

అంతే కాకుండా హైదరాబాద్, తిరుపతి, ఔరంగాబాద్, హుబ్లీ, జబల్ పూర్, కాంగ్రా కుషి నగర్, గయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. వీటి ద్వారా మార్చ్ 2024 నాటికి దాదాపు రూ.3700 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే అమ్మిన తరవాత ఆదాయ పంపకాలు ఉంటాయి కానీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వానిదే ఉంటుంది. ఇదిలా ఉండగా త్వరలోనే జైపూర్ ,గౌహతి, తిరువంతపురం ఎయిర్ పోర్ట్ లను అదాని గ్రూప్ త్వరలోనే స్వాధీనం చేసుకోనుంది. ఇక అమ్మకానికి పెట్టిన ఎయిర్ పోర్ట్ లకు మంచి బేరం కుదిరితే అవి కూడా వీలైనంత త్వరగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి జనాలపై వేటు పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: