ఇక మన దేశంలో వ్యాక్సినేషన్ కు ఉద్దేశించిన కొవిన్ యాప్.. మరిో కొత్త సౌకర్యం తెచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ-వీసీ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగిణి తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి.. ప్రయాణానికి అనుమతి ఇవ్వడానికి ముందు ఆయా సంస్థలు అవతలి వ్యక్తి స్టేటస్ తెలుసుకోవచ్చు.
కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ విషయంలో కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇలా ప్రవర్తిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. అనారోగ్య కారణాలు మినహా మరే ఇతర కారణాలతో ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు ప్రకటించారు. అలాంటి ఉద్యోగులందరూ ఈ నెల 15తర్వాత రావొద్దని సీఎం స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు భారత్ లో గత 24గంటల్లో 15లక్షల 92వేల 135కరోనా టెస్టులు చేస్తే.. 33వేల 376మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో 308మంది చనిపోయారు. మొత్తం కేసులు 3కోట్ల 32వేల 8లక్షల 330కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 3లక్షల 91వేల 516యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో ఒక్క కేరళలోనే 25వేల 10కేసులు, 177మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 73.05కోట్ల టీకా డోసులు ఇచ్చారు.