విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజుకు ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాజుల వంశానికి చెందిన అశోక్‌కు జిల్లాపై మంచి పట్టు ఉంది. అందుకే ఏ ఎన్నికల్లోనైనా అశోక్‌కు తిరుగుండేది కాదు. ముఖ్యంగా ఆయన కంచుకోటగా విజయనగరం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని ఏడు సార్లు గెలిపించారు. అయితే మొదట అశోక్...జనతా పార్టీ నుంచి పోటీ చేసి 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున అశోక్ విజయం సాధించారు.

ఇక 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానంలో మీసాల గీతని టి‌డి‌పి తరుపున గెలిపించారు. అశోక్ విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లోనే అశోక్ ఫ్యామిలీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అటు విజయనగరం అసెంబ్లీ స్థానంలో అశోక్ కుమార్తె అథితి ఓటమి పాలవ్వగా, పార్లమెంట్ స్థానంలో అశోక్ ఓటమి పాలయ్యారు.

జగన్ గాలిలో అశోక్ ఫ్యామిలీ చిత్తు అయింది. అయితే మామూలుగా ఉండుంటే అశోక్ ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం, అశోక్‌ని ఏ విధంగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇలా టార్గెట్ చేయడమే అశోక్‌కు బాగా ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. అనవసరంగా అశోక్‌ని వైసీపీ టార్గెట్ చేసిందనే భావనలో విజయనగరం ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే అక్కడ అశోక్ ఫ్యామిలీకి మద్ధతు పెరిగినట్లు కనిపిస్తోంది.


ఇదే సమయంలో విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లపై ప్రజా వ్యతిరేకత పెరిగినట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాల్లో అశోక్ ఫ్యామిలీకు మంచి ఛాన్స్ దొరికినట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు అశోక్ ఫ్యామిలీ ఖాతాలో పడేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి విజయనగరంలో అశోక్ ఫ్యామిలీకి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: