ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 217 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మత్యకార జేఏసీ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా  కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.  మత్యకార సంఘాలు చేపట్టిన ఆందోళన కు  వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా  మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 217 జీవో తీసుకువచ్చి మత్యకారుల పొట్ట కొడుతున్నారని..  ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల సుమారు 650 నుండి 700 వరకు ఉన్న మత్యకార సొసైటీల ఉనికి కోల్పోయే ప్రమాద ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కొల్లు రవీంద్ర.

చెరువులను ఆన్ లైన్ టెండరింగ్ చేయడం వల్ల దళారులు వచ్చే ప్రమాదం ఉందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మత్యకార సొసైటీలను ప్రోత్సహిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు కొల్లు రవీంద్ర.  టీడీపీ హయాం లో 70 శాతం రాయితీ తో మత్యకారుల వేటకు కావాల్సిన పరికరాలను అందించేవారని పేర్కొన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ ప్రభుత్వం నేడు ఆ సబ్సి డీ  కి మంగళం పాడిందని నిప్పులు చెరిగారు కొల్లు రవీంద్ర. మత్యకారుల కు వేట బ్యాన్ సమయం లో ఇచ్చే 4 వేల ను కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మత్యకారులకు మత్యకార భరోసా చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని ... మొండిగా ముందుకు వెళితే మత్యకారులు తెడ్డు తిరగేస్తారని హెచ్చరించారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కొల్లు రవీంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: