ఏపీలో కేబినెట్ లో ప్ర‌క్షాళ‌న జ‌రిగితే రాజ‌ధాని ప్రాంతం నుంచి కొత్త మంత్రులు ఎవ‌రు అవుతారు ?  తాజా మంత్రులు ఎవ‌రు మాజీలు అవుతారు ? అన్న దానిపై కృష్నా - గుంటూరు జిల్లా ల‌లో ఆస‌క్తి క‌ర చర్చ‌లు అధికార పార్టీ నేత‌ల్లో జ‌రుగుతున్నాయి. ఈ రెండు జిల్లాలు చాలా కీల‌కం. రాజ‌ధాని మార్పు ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల లో ఈ రెండు జిల్లాల లో ఎక్కువుగా ఉంటుంద‌నే అంటున్నారు. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో ప్ర‌స్తుతం కేబినెట్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ( క‌మ్మ ) - బంద‌రు ఎమ్మెల్యే పేర్ని నాని ( కాపు ) - విజ‌యవాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ( వైశ్య ) మంత్రులుగా ఉన్నారు.

ఇక మార్పులు , చేర్పుల్లో ఎవ‌రు కేబినెట్లో ఉంటారు ? ఎవ‌రు కొత్త‌గా వ‌స్తారు ? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌. కొడాలి నాని ఫైర్ బ్రాండ్‌.. పైగా క‌మ్మ వ‌ర్గంనుంచి ఇంత‌క‌న్నా స్పీడ్ ఉన్న నేత ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు మ‌ళ్లీ ప‌ద‌వి ఖాయ‌మ‌ని.. ఆయ‌న సేఫ్ జోన్‌లోనే ఉంటార‌ని అంటున్నారు. ఇక కాపు వ‌ర్గం నుంచి న‌లుగురు మంత్రులు ఇప్పుడు ఉన్నారు. వీరిలో పేర్ని నాని సేఫ్ జోన్ లోనే ఉన్నార‌ని అంటున్నారు. ఆయ‌న‌ను నూటికి నూరు శాతం త‌ప్పించే ఛాన్స్ లేదు. అయితే ఇదే క్యాస్ట్ నుంచి జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోదా ? అని ఆశ‌ల‌తో ఉన్నారు.

ఇక బీసీ కోటాలో జోగి ర‌మేష్‌, అదే బీసీ కోటాలో పెన‌మ‌లూరు ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలు సు పార్థ సార‌థి కూడా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. అయితే అనిల్ కుమార్‌ను త‌ప్పిస్తేనే వీరికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్సీ కోటాలో తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ నిధి రేసులో ఉన్నారు. ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యే గా ఉండ‌డంతో పాటు జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉండ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్ కానుంది. వెల‌మ కోటా ఉంటే ఖ‌చ్చితంగా నూజివీడు ఎమ్మెల్యే ప్ర‌తాప్ మంత్రి అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: