తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు కు  లేఖ రాశారు బీజేపీ  తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షులు  బండి  సంజయ్  కుమార్. రైతు  రుణ  మాఫీ , రాష్ట్రం లో  రైతులు  ఎదుర్కొం టున్న సమస్యల పై  ముఖ్యమంత్రి  కెసిఆర్   కు  ఐదు పేజీల   బహిరంగ   లేఖ  రాశారు బండి సంజయ్‌.    2018 ఎన్నికల  సందర్భం గా   తెరాస  పార్టీ   ఇచ్చిన  లక్ష  రూపాయల  రైతు  రుణ  మాఫీ ని  వెంటనే  అమలు  చెయ్యాలని లేఖ లో డిమాండ్  చేశారు  బండి  సంజయ్. 

రైతు రుణ  మాఫీ  క్రింద  ఇవ్వా లిసిన  27 వేల  500 కోట్ల  రూపాయల  నిధులను  విడుదల చేయాలని పేర్కొన్న  బండి  సంజయ్.. ముఖ్యమంత్రి  కెసిఆర్  వరి  పంట  వేయొద్ద ని  ఇచ్చిన  ప్రకటనను   ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రధాన  మంత్రి  ఫసల్  భీమా  పధకం  క్రింద తెలంగాణ రాష్ట్ర   ప్రభుత్వం  తమ   వాటా  సొమ్ము  413. 50 కోట్ల  రూపాయలను  చెల్లించి  రైతులను  ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు బండి  సంజయ్.  తెలంగాణ రాష్ట్రం లో  జరు గుతున్న  రైతుల  ఆత్మ  హత్యలు  అన్ని   తెరాస  ప్రభుత్వ  హత్యలేనని నిప్పులు చెరిగార బండి  సంజయ్.  

రైతులకు  ఉచితంగా  ఎరువులు  ఇచ్చి  2018 ఎన్నికలు  సందర్భంగా  తెరాస  ఇచ్చిన  హామీ ని  నిలుపుకోవాలని తెలిపారు.  మొక్కజొన్న  కొనుగోలు  కేంద్రాలు  వెంటనే  ప్రారంభించి , రైతులను  దళారీలనుండి  రక్షించాలన్నారు బండి  సంజయ్.  ధరణి లో  జరుగుతున్న  అక్రమాలను  అరికట్టాలని... రైతులకు  పట్టా దారు  పాసు బుక్కులను  వెంటనే  మంజూరు  చెయ్యాలని డిమాండ్‌ చేశారు బండి  సంజయ్.  రైతులకు  అండగా   ఉండి  వారి  తరఫున  బీజేపీ  తెలంగాణ  శాఖ  పోరాటం  చేస్తుందని స్పష్టం చేశారు బండి  సంజయ్‌. తెలంగాణ రైతుల సమస్యల తో, ప్రజల సమస్యల ను పట్టించు కోవాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: