హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేసి... ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ ముందు స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రౌండ్ స్థాయిలో ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు. అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ముందే ప్రకటించి... ప్రచారంలో దూసు కెలుతోంది. ఉద్యమ నాయకుడు, హుజరాబాద్ లోకల్ లీడర్ గెల్లు శ్రీనివాస్  అభ్యర్థిగా నియామకం చేసింది టిఆర్ఎస్ పార్టీ. అటు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ప్రకటించకపోయినా... మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైనల్ అవుతారని ప్రచారం సాగుతోంది. ఏదైనా జరిగితే తప్ప... బీజేపీ అభ్యర్థులు మార్పు ఉండదు. 

ఈ రెండు పార్టీలు సరేకానీ... అభ్యర్థి ఎంపికలు కాంగ్రెస్ పార్టీ... మొదటి నుంచి తర్జనభర్జన అవుతోంది. మొదట్లో పొన్నం ప్రభాకర్ ను హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడతారని అందరూ అనుకున్నా... చివరికి అది గాలివార్త అలాగే మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం కొండా సురేఖ ను హుజురాబాద్ అభ్యర్థిగా నిలబడతారని... ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే... అధికార టీఆర్ఎస్ పార్టీకి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.  తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థిని ప్రకటించడం లేదని... భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై ఇలా వ్యవహరిస్తోందని టిఆర్ఎస్ నేతలు వాపోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత.... దళిత మరియు గిరిజన దండోరా పేరుతో... రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా... హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించడం లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ఈటల రాజేందర్ గెలుపు నకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక అటు హుజూరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ గెలిస్తే ఎక్కువ నష్టం... కాంగ్రెస్ పార్టీకి నని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ కారణంగా బిజెపి పార్టీ గెలిస్తే... తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని... ఆ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుందని మరికొందరి వాదన. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై అందరిలోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: