ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ సహకారంతో నిర్మించే కాలనీ ఇళ్లకు ఇక నుంచి ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. పేదల కోసం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో ముప్పై నాలుగు వేల కోట్లు పై చిలికు మొత్తం వెచ్చించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద నగరాలలో అందిస్తున్నట్లుగా కాలనీ ఇళ్లకు అండర్ గ్రౌండ్ విద్యుత్ ను సమకూర్చనున్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించ నున్నారు. ఇందు కోసం ఏడు వేల కొట్లకు పైగా నిధులు వ్యయం చేయనున్నారు.
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటింటికీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎపిఎస్ఎఫ్ ఎల్) ను ఏర్పాటు చేశారు. ఆరంభం నుంచి రోజుకో వివాదంలో ఆ సంస్థ నడుస్తోంది. ఈ సంస్థలో జరిగిన అవకతవకలపై సి.ఐ.డి విచారణ జరుపుతోంది. ఈ క్రమలో సీనియర్ అధికారులను సిఐడి అరెస్టు చేసింది. కాలనీల్లో ఇళ్లకు విద్యుత్ తో పాటు ఇంటర్నెట్ సదుపాయం ఎలా ఇస్తారన్న విషయం ప్రభుత్వ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
కాలనీ ఇళ్లలో పనులన్నీ మరో ఏడాదిలో పు అంటే 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా కాలనీ ఇళ్లు నిర్మించే ప్రాంతాలలో సిమెంటు ఇటుకలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాలనీలు నిర్మించే ప్రాంతాలలో సిమెంటు ఇటుకలు తయారీ యూనిట్ల ఏర్పాటు పై ఇప్పటికే సూళ్లూరు పేట నియోజక వర్గంలో ప్రయోగం చేసింది. అది సత్ప్ ఫలితాలు ఇచ్చింది. అదే ముసాయిదాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా గృహాలు నిర్మించుకునే లబ్దిదారుకు ఇటుకలను రవాణ చేసుకునేందు అయ్యే వ్యయం తగ్గుతుంది. కాలనీల్లో గృహ నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలవాలని, అందరి చూపు రాష్ట్రం పై ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
లేఅవుట్ లను రెండు విభాగాలుగా విభజించారు. 550 ప్లాట్ లు , అంతకన్నా తక్కువ ఉన్న ప్రాంతాన్ని ఒక టో కేటగిరీగానూ, అంతకు మించి ప్లాట్ లు ఉన్న లే అవుట్లను మరో కేటగిరీ గాను గుర్తిస్తారు. మోదటి కేటగిరీ ఇళ్లకు ఓవర్ హెడ్ ద్వారా విద్యత్ సౌకర్యం- ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. 550 ప్లాట్లకన్నా ఎక్కువ ఉన్న కాలనీలన్నింటికీ భుగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది.