ఈ క్రమంలోనే చైనా ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా భారత్ దేశాలు క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఒకటిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఇలా చైనా సృష్టించిన ఉద్రిక్త పరిస్థితులే భారత్ కు ఎంతగానో కలిసొస్తుంది. మొన్నటికి మొన్న చైనా జపాన్ తో వివాదం పెట్టుకోవడంతో ఇక జపాన్ కు సంబంధించిన కంపెనీలన్ని చైనా నుంచి బయటకు రావాలని జపాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.ఇక అలా బయటకు వచ్చిన కంపెనీలు భారత్ లో స్థాపిస్తే ప్రత్యేకమైన ప్యాకేజీ కూడా ఇస్తాం అంటూ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎన్నో జపాన్ కంపెనీలు చైనా నుంచి భారత్ కు తరలి వచ్చాయి.
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భారత్ లో భారీగా పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భారత్లో తగినంత మానవ వనరులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయని భారత్ లోకి వచ్చి సంస్థలు స్థాపించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం కోరడం.. పన్నులలో మినహాయింపులు ఇస్తామంటూ చెప్పడంతో.. ఇక ఆస్ట్రేలియా కు సంబంధించి ఎన్నో పెద్ద కంపెనీలు భారత్ లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సమావేశం జరిగగా.. ఈనెలాఖరులో మరో సమావేశం జరగబోతున్న తెలుస్తుంది. అయితే చైనాతో ఆస్ట్రేలియాకు వివాదం కారణంగానే చైనాను కాదని భారత్లో ఆస్ట్రేలియా సంస్థలు స్థాపించేందుకు సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.