ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై  మరో సారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మాట తప్పారని..  మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తామన్న ఎన్నికల హామీని అధికారం లోకి వచ్చాక మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. మద్య నిషేధమని హామీ నిచ్చి నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంద్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. పేదల పొట్ట కొట్టి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడం గాంధీజీ ఆశయమా. ? అని నిలదీశారు చంద్రబాబు నాయుడు. 

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారన్నారు చంద్రబాబు నాయుడు. అప్పులు చేయటమే గాంధీజీ సిద్ధాంతమా.. ? అని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టికి అడుగులు పడితే నేడు చెత్త పై కూడా పన్నులు వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం ఆదాయాన్ని గతంకంటే 75 శాతం పెంచారని సీరియస్ అయ్యారు. రూ.20కే తయారయ్యే మద్యం సీసాను రూ. 200 లకు అమ్ముతూ ఏడాదికి రూ. 5 వేల కోట్ల మేర జే. ట్యాక్స్ దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడు.

అటు  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ సర్కార్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు అంటూ ఫైర్ అయ్యారు.  శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. విచక్షణా రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చెయ్యడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం చేయించాలని.. దళితుల పై దాడికి తెగబడిన వైసీపీ నాయకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: