ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా... వాడని వారు వుండరు. ఉదయం బెడ్ నుంచి లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునే అంతవరకు సోషల్ మీడియా లోనే ఫుల్ బిజీ అయిపోయారు జనాలు. వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియాలో తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ మరియు బంధువులతో టచ్లో ఉంటూ ఎంతో ఆనందాన్ని నడిపిస్తున్నారు. అయితే  సోషల్ మీడియా కారణంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో... అని నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా కారణంగా.. జరిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగాలు కోల్పోవడం : సోషల్ మీడియా పోస్టులు మన ఉద్యోగంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియా లో పెట్టే పోస్టులు ఉద్యోగాలకు మెసేజ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ మనం వాడే సోషల్ మీడియా పనిగా ఉంటుంది. మన వ్యక్తిత్వం అభిరుచులు ఇలా అన్నిటినీ తెలుసుకుంటుంది. అలాగే మీరు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు చేసే దాన్ని బట్టి... క్యారెక్టర్ ను కూడా అంచనా చేసేస్తోంది. ఏదైనా అభ్యంతరకర పోస్టులు గాని ఏదైనా పెడితే... మీ జాబ్ ఓడిపోవడం ఖాయం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా కారణంగా మిలియన్ల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి.

Esta అప్లికేషన్ : ఈ అప్లికేషన్ కారణంగా  మీ యొక్క సమాచారాన్ని... తెలుసుకుంటాయి సోషల్ మీడియా కంపెనీలు. తద్వారా మీ యొక్క క్యారెక్టర్ మరియు మీ అభిరుచులను పసిగడతాయి ఈ కంపెనీలు. అప్పుడు మీ జుట్టు వారి చేతుల్లోకి వెళ్లి బానిసలు గా అయిపోతారు.

చట్ట పరమైన విషయాలు  : మీయొక్క సోషల్ మీడియా పోస్టల్ చట్టప్రకారం ఎవిడెన్స్ గా వాడొచ్చు. మీరు ఎవరైనా టీజింగ్ చేసిన ఫొటోస్... సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే... అప్పుడు వాటిని సాక్ష్యాలుగా తీసుకుంటారు.  దీంతో మీకు శిక్ష పడటం ఖాయం. కాబట్టి  సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కొత్త సంబంధాలు : ఈ సోషల్ మీడియా కారణంగా... ఇతరుల సమాచారం ఇట్టే పసిగట్టవచ్చు.  వారు చేసే పోస్టులు కామెంట్లను బట్టి.... వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేయవచ్చు. తద్వారా వారిని మనం లొంగదీసుకుని ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ చట్ట ప్రకారం చాలా నేరం. కానీ సోషల్ మీడియా కారణంగా అవతలి వ్యక్తిని జీవితంలోకి కూడా ఇతరులు ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఏ పోస్ట్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

వేధింపులు : సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన సమస్య వేధింపులు మరియు దుర్వినియోగం. సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ ను హ్యాక్ చేసి మనను బెదిరింపులకు గురి చేస్తారు. అంతేకాదు కొంతమంది నేరగాళ్లు... సోషల్ మీడియాలో యువతులకు గాలం వేస్తూ ఉంటారు. ఇక మరికొందరేమో సైబర్ క్రైమ్ కు పాల్పడి డబ్బులు దోచేస్తుంటారు.

అసత్య ప్రచారం : సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత... ఎక్కువగా అసత్య ప్రచారంమే... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏది పడితే అది... షేర్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. దీంతో అవతలి వ్యక్తి కూడా అది నిజమేనని... భావిస్తుంటాడు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం... నిజమైనది అని భావించలేము. కాబట్టి సోషల్ మీడియా వాడేటప్పుడు... మనం బానిసలుగా కాకుండా... చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: