టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.  తనను మోసం చేసింది కెసిఆర్ అని... తాను కాదని తెలిపారు ఈటల రాజేందర్.  అర్థాంతరంగా, దుర్మార్గంగా బర్తరఫ్ చేసింది కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు ఈటల.   పార్టీ నుంచి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది వారని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తీసుకు వచ్చిన కూడా లొంగ లేదని గుర్తు చేశారు ఈటల రాజేందర్‌.   

తన పదవి తెలంగాణ ప్రజలు ఇచ్చింది అని చెప్పి కష్టపడి పని చేశానని స్పష్టం చేశారు ఈటల.  13, 14 తేదీల్లో నాకు నేనుగా దాడి చేయించుకొని.. నా భార్య కొంగు చాచి ఓట్లు అడుక్కుంటుండి అని ఒక ఎమ్మెల్యే నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   మీకు భార్యలు లేరా? మీకు చెల్లెళ్ళు లేరా? ఆడవాళ్ళు అంటే అంత చులకనా ? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈటల రాజేందర్‌.  డబ్బుల మధం తో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని.... ప్రతి దళిత కుటుంబం కు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు ఈటల రాజేందర్‌.  

ఇవ్వక పోతే నేను గెలిచిన తరువాత మెడలు వచ్చి పది లక్షలు ఇప్పిస్తానని స్పష్టం చేశారు ఈటల.  అన్ని కులాల్లో ఉన్న వారికి కూడా పది లక్షలు ఇవ్వాలని... బీసీ బంధు కూడా పెట్టాలని డిమాండ్‌ చేశారు ఈటల రాజేందర్‌.  సొమ్ము కేంద్రప్రభుత్వాన్ని సోకు కేసీఆర్ దని నిప్పులు చెరిగారు. 2023 ఎన్నికలలో ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానేనని స్పష్టం చేశారు ఈటల.   వీరి పీడ విరగడ అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌ ప్రజలు....  టీఆర్ఎస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఈటల రాజేందర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: