కానీ ఈ సారి మాత్రం అలా జరగకూడదని టిడిపి-జనసేనలు భావిస్తున్నాయి. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు ద్వారా ముందేకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే విషయంపై కూడా చర్చలు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే జనసేనకు బాగా పట్టున్న పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. ఇందులో కనీసం 5 సీట్లు అయిన జనసేన డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అందులోనూ జనసేన ఏ సీట్లు తీసుకుంటుందో కూడా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుందో ఆ సీట్లు అడిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్లో జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఖచ్చితంగా ఈ రెండు సీట్లు జనసేనకే వెళ్తాయని తెలుస్తోంది. అటు తాడేపల్లిగూడెంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఇవిగాక మరో రెండు సీట్లని జనసేన తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లోనే టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే జిల్లాలో 10 సీట్లు ఖచ్చితంగా గెలుచుకునేవి. కానీ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి ప్లస్ అయింది. మరి ఈ సారి ఆ తప్పు చేయకూడదని టిడిపి-జనసేనలు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.