తెలంగాణలో నిన్నటి నుండి ప్రత్యేక పండుగగా బావించే బతుకమ్మ పండుగ మొదలయింది. ఈ పండుగ మొత్తం 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటారు. అయితే మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గత నెల జీతం ఇప్పటి వరకు ఉద్యోగులకు అందలేదు అని తెలుస్తోంది. ప్రభుత్వం లో వివిధ సమస్యల కారణంగా రోజుకి రెండు జిల్లాలలో ఉద్యోగులకు జీతాలను సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అయితే ముందు నెల వరకు జీతాలు 15 వ తేదీన ఇవ్వడం జరిగింది. కానీ ఈ నెలలో పండుగ కావడం వలన ఇంకా ముందుగానే జీతాలు వస్తాయని ఆశించిన ఉద్యోగస్తులకు నిరాశ తప్పలేదు. ట్రెజరీ లు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 14 వ తేదీ లోపు అందరికీ జీతాలు అందుతాయని అంటున్నారు.

ఈ కారణంగా ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగైంది అని చెప్పుకుంటున్నా, ఇలా జీతాలు ఆలస్యం చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక సమస్య అయితే, ఈ మధ్యనే జీతాలు పెంచిన వారికి కూడా పెరిగిన వేతనాలను జమ చేయడం లేదు. అయితే ప్రభుత్వం ఎందుకు ఇలా ముందుంచుపు లేకుండా ప్రవర్తించింది అని ఆలోచిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ పండుగ నాడు నిరాశే మిగిలింది.

మరి ఈ విషయంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంతే కాకుండా వీలైతే ఒకటి రెండు రోజుల్లో జీతాలు ఉద్యోగులకు వచ్చేలా చేయగలిగితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ జీతాల ఎఫెక్ట్ ఈ నెలాఖరులో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికపై ఉంటుందా అన్న విషయం కూడా రాజకీయ ప్రముఖులు పరిశీలిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: