టి‌డి‌పి అధినేత చంద్రబాబు వైఖరి పెద్దగా మారుతున్నట్లు కనిపించడం లేదు..ఎంతసేపు అదే ఓల్డ్ పాలిటిక్స్ చేస్తూ...ఇంకా పార్టీని ట్రబుల్ పెడుతున్నట్లే కనిపిస్తోంది. బాబు ఓల్డ్ పాలిటిక్స్ అంటే వేరే పని పెట్టుకోవడం లేదు....ఎంతసేపు జగన్‌ని తిట్టడమే. తన పార్టీ నేతలతో తిట్టించడం. అసలు ఓడిపోయిన దగ్గర నుంచి జగన్‌ని తిట్టడంపై పెట్టిన దృష్టి కాస్త పార్టీ బలోపేతంపై పెట్టి ఉంటే ఈ పాటికి టి‌డి‌పి కాస్త పికప్ అయ్యేది.

కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయడం లేదు. ఏం లేదు తెల్లారి లేస్తే జగన్‌ని విమర్శించాలి...లేదంటే గొంతులో ముద్ద కూడా దిగదు అన్నట్లుగా పరిస్తితి మారిపోయింది. ఇక బాబు కూడా పార్టీలో తప్పులు చెప్పే నేతలు కంటే....తాము తోపులమని పొగిడే నేతలు, జగన్‌ని తిట్టే నేతలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు జగన్ అధికార పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి అదే పనిలో ఉంటున్నారు.

పైగా టి‌డి‌పిలో మాట్లాడే నాయకులు ఎవరూ లేనట్లు...ఆ పట్టాభి ఒకరు బాగా హడావిడి చేస్తారని సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తిగా ఉన్నాయి. నాలుగైదు పేపర్లు పట్టుకోవడం..నిత్యం మీడియా ముందుకు రావడం...జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం. ఎక్కడైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ప్రజలు కూడా కాస్త నమ్ముతారు...కానీ ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు...గుడ్డిగా జగన్‌పై విమర్శలు చేయడం వల్ల టి‌డి‌పికి పావలా ఉపయోగం ఉండదు.

అందుకే గత కొన్ని రోజులుగా డ్రగ్స్ అంశంలో టి‌డి‌పి నేతలు తెగ రచ్చ చేస్తున్నారు...జగనే డ్రగ్స్ అమ్ముతున్నారన్నట్లు మాట్లాడుతున్నారు....ఇక పట్టాభి లాంటి వారైతే జగన్ డ్రగ్ డాన్ అంటూ విమర్శిస్తున్నారు. దీనికి బాబు వత్తాసు పలకడం చేస్తున్నారు. అసలు తాలిబన్లకు...తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు గానీ, ఇతర టి‌డి‌పి నేతలు గానీ ఇలా గుడ్డిగా జగన్‌పై విమర్శలు చేయడం వల్ల పార్టీకి లాభం జరగకపోగా, నష్టం జరుగుతుందని కొందరు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఇకనైనా అలాంటి విమర్శలు మానేసి పార్టీపై దృష్టి పెట్టమని తమ్ముళ్ళు...బాబుకు దండాలు కూడా పెట్టేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp