డ్రోన్ కెమెరాలు డ్రోన్ షార్ట్స్  ఏపీ టీడీపీ లో ప్రస్తుతం ఇదే పెద్ద చర్చగా సాగుతోంది. రాజకీయ అంశాలపై సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో  వీటితో ఎక్కువగా మదనపడుతున్నారా..? ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయి?  ప్రభుత్వ పనితీరెంటి? క్షేత్రస్థాయిలో ని పరిస్థితులపై సహజంగానే అన్ని పార్టీలు  లలో ఉన్న చర్చ కామన్. ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి ఆందోళనలు చేపట్టాలి. నిరసన కార్యక్రమాలు ఏంటో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ టిడిపి లో విచిత్రమైన చర్చ జరుగుతుందటా.

 ఆ చర్చ కూడా డ్రోన్ కెమెరాలు, డ్రోన్ విజువల్స్ గురించే. ఇటీవల వైసీపీ సర్కార్ చెత్త సేకరణ వాహనాలను ఒకేసారి జిల్లాకు పంపింది. అలా పంపుతున్న క్రమంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నాలుగువేల వాహనాలను చేర్చి ఒకేసారి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరా లతో  షూట్ చేసి మీడియాకు రిలీజ్ చేశారు. ఆ డ్రోన్ విజువల్స్ జనాల అటెన్షన్ తీసుకువచ్చాయి. ఆ విజువల్ ఇంపాక్ట్ పైనే టిడిపి లో చర్చ జరుగుతోందటా. చట్ట వాహనాలకు ముందు  అదే బెంజిసర్కిల్ నుంచి 108,104 అంబులెన్సులను, రేషన్ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇదేవిధంగా జిల్లాకు పంపారు. అప్పుడు కూడా డ్రోన్ విజువల్స్ ను రికార్డ్ చేసి  మీడియాకు పంపింది వైసీపీ సర్కార్. ఇదే కాదు గతంలో సీఎం జగన్ పాదయాత్ర, బహిరంగ సభల దృశ్యాలను కూడా డ్రోన్ ద్వారానే రికార్డు చేసి రిలీజ్ చేసేవారు. ఆ  విజువల్స్ జనాలను కనువిందు చేసేవి. ఇప్పుడు అవే దృశ్యాలను చూసి టిడిపి కళ్ళు కుట్టుకునే పరిస్థితి ఉందట. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలు ఎందుకు రాలేదని టిడిపి  సమావేశాల్లో మాజీ మంత్రులు ప్రస్తావిస్తున్నారటా. టిడిపి పవర్ లో ఉండగా  రైతు రథం పేరుతో 13 జిల్లాలకు సుమారు రెండువేల ట్రాక్టర్లు ఇచ్చి ఉంటామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారట. అప్పుడు ఇదే విధంగా ట్రాక్టర్ల ను ఒకే చోట పెట్టి లాంచ్  చేసి ఉంటే బాగుండేదని తమ్ముళ్లు బాధపడుతున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో మరో చర్చ జరుగుతోంది. టెక్నాలజీని ప్రవేశపెట్టడం తమతోనే సాధ్యమని జబ్బలు చరుచుకునే తమ నేతలకు డ్రోన్ కెమెరా లే గుర్తుకు రాలేదా అని సెటైర్లు వేస్తున్నారట. టెక్నాలజీని ప్రవేశపెట్టడమే కాదు, వాడుకోవడం తెలియాలని సన్నాయి నొక్కులు నొక్కే వారు ఉన్నారట. మొత్తానికి డ్రోన్ కెమెరా విజువల్స్ ప్రభావం ఎలా ఉన్నా ఆ దృశ్యాలు మాత్రం టిడిపిని బాగానే కలవరపెడుతున్నాయి అని చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: