గంటా శ్రీనివాసరావు.....ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు....అయితే అధికారం ఉన్నప్పుడు మాత్రమే గంటా రాజకీయాల్లో హైలైట్ అవుతూ ఉంటారు...ఇక అధికారం లేకపోతే....అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున గెలిచాక గంటా చేస్తున్న పని అదే. టి‌డి‌పి అధికారం కోల్పోవడంతో గంటా శ్రీనివాసరావు....అధికార పార్టీలోకి ప్రయత్నాలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. మీడియాలో కథనాలు వచ్చాయి. ఎప్పటికప్పుడు గంటా పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.

కానీ విశాఖలో వైసీపీ నేతలు....గంటాని తమ పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిసింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు గంటాని వైసీపీలోకి రాకుండా అడ్డుకున్నారని కథనాలు వచ్చాయి. మరి ఏం జరిగిందో ఏమో గానీ గంటా పార్టీ మారడం జరగలేదు. అలా అని టి‌డి‌పిలో యాక్టివ్ గా లేరు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.

రాజీనామా చేశాక వెళ్ళి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం ఏమి చేయడం లేదు. సైలెంట్‌గా ఇంటికే పరిమితమయ్యా రు. అటు గెలిపించిన విశాఖ నార్త్ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చేయడం లేదు. అయితే నియోజకవర్గాన్ని గాలికొదిలేయడంతో నార్త్‌లో టి‌డి‌పి వీక్ అయిపోతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నార్త్‌లో కూడా ఒక ఇంచార్జ్‌ని నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గంటా వియ్యకులు సైడ్ అయిపోయారు. నెల్లూరు సిటీలో నారాయణ సైడ్ అవ్వడంతో అక్కడ...కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక భీమవరంలో ఉన్న మరో వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు సైతం టి‌డి‌పిలో కనిపించడం లేదు. దీంతో తాజాగా ఆయన్ని తప్పించి తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఇక ఎలాగో ఇద్దరు వియ్యంకులు సైడ్ అయ్యారు కాబట్టి, గంటా కూడా సైడ్ అయిపోతారని తెలుస్తోంది. ఇక ఆయన ప్లేస్‌లో నార్త్ బాధ్యతలు వేరే నేతకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: