అయితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల్లో కమ్మ నేతల మధ్య మంచి ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మైలవరంలో టిడిపి నుంచి పోటీ చేసిన దేవినేని ఉమాపై వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. వీరే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ పడనున్నారు. ఇటు గుడివాడలో వైసీపీ తరుపున కొడాలి నాని సత్తా చాటుతున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ బరిలో టిడిపి తరుపున నిలబడిన దేవినేని అవినాష్‌ని కొడాలి చిత్తు చేశారు.
ఎన్నికలయ్యాక దేవినేని వైసీపీలోకి వచ్చేసి..విజయవాడ తూర్పు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు చెక్ పెట్టాలని అవినాష్ ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు కమ్మ నేతల మధ్య గట్టి ఫైట్ జరుగనుంది. అటు గుడివాడలో కొడాలి, రావి వెంకటేశ్వరరావు మధ్య పోరు జరిగేలా కనిపిస్తోంది.
విజయవాడ పార్లమెంట్ బరిలో టిడిపి ఎంపీ కేశినేని నానిపై....వైసీపీ తరుపున ఏ కమ్మ నేత దిగుతారో చూడాలి. ఇటు పెనమలూరులో టిడిపి నేత బోడే ప్రసాద్...బీసీ నేత, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో తలపడతారు...అటు గన్నవరంలో వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ... బీసీ వర్గానికి చెందిన టిడిపి నేత బచ్చుల అర్జునుడుతో తలపడనున్నారు. మరి ఈ కమ్మ నేతల్లో ఏ నాయకుడు సెట్ అవుతారో చూడాలి. మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. గన్నవరం, గుడివాడల్లో వైసీపీకి వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు.