ఈ పాఠశాలలు రక్షణ మంత్రిత్వశాఖ ప్రస్తుత సైనిక పాఠశాల కన్నా ఎంతో విభిన్నంగా పనిచేస్తాయి అంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో తెలిపింది. 2022 -23 విద్యా సంవత్సరం నుంచి ఇక ఈ కొత్త వంద సైనిక పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి అంటూ కేంద్రం తెలిపింది. అయితే ఈ పాఠశాలలో ఆరో తరగతి లో ఐదు వేల మంది విద్యార్థులు చేరేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ వంద సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలలు ఉండగా ఆరవ తరగతి విద్యార్థులు 3,000 మంది ఉన్నారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 100 సైనిక్ పాఠశాలను ప్రారంభించేందుకు నిర్ణయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సైనిక పాఠశాలలో పిల్లలకు విలువ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడమే కాదు సాధారణ నేపథ్యాల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకున్న విద్యార్థుల గర్వించదగిన చరిత్రను కూడా అందిస్తాయి అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలా విద్యార్థులను కేవలం విద్యావంతులుగా మాత్రమే కాదు అత్యున్నత స్థానానికి చేరడమే లక్ష్యంగా సైనిక్ స్కూల్స్ ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమైందట.