ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 11,00,123 కరోనా టెస్టులు చేయగా.. 14, 146మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 144మంది మరణించారని పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 40లక్షల 67వేల 719కు చేరగా.. ఇప్పటి వరకు 4లక్షల 52వేల 124మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 19వేల 788మంది కరోనా నుంచి కోలుకొని.. డిశ్చర్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,95,846 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30వేల 50 మంది నమూనాలు పరిశీలించగా.. 111మందికి కరోనా సోకినట్టు తేలింది. కరోనాతో ఒకరు మృతి చెందారు. 187మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇఫ్పటి వరకు కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 6లక్షల 68వేల 833కు చేరుకుంది. 3వేల 937మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 979యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 432కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 5మరణాలు వెలుగు చూశాయి. ఇక కరోనా నుంచి మరో 586మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6వేల 34కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 24గంటల వ్యవధిలో29వేల 243 కరోనా టెస్టులు చేశారు.