ఎందుకంటే వైజాగ్ ను డెవలప్ చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. అంతేకాదు కొన్ని స్టూడియోల నిర్మాణానికీ తాను సహకరిస్తానని చెబుతున్నారు. సినిమా ఫంక్షన్లు కొన్ని జరిగితే మీడియా ఎటెన్షన్ వస్తుంది. అదేవిధంగా షూటింగ్ లు జరిగితే ఈ ప్రాంతంపై మరింత ఫోకస్ పెరుగుతుంది. ఆర్థిక రాజధానిని ఆశించిన దాని కన్నా, ఊహించిన దాని కన్నా బాగా ప్రొజెక్ట్ చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది. ఇవన్నీ సి నిమావాళ్లతోనే కాస్తయినా సాధ్యం అయ్యే పనులు. అందుకే వైజాగ్ కేంద్రంగా కొన్ని మంచి పనులు చేపట్టేందుకు ఇండస్ట్రీ సా యం కోరుతున్నారు. హైద్రాబాద్ డెవలప్మెంట్ లో కూడా సినీ ఇండస్ట్రీ భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా విశాఖ అభివృద్ధికీ ఇండస్ట్రీ సహకారం అడుగుతున్నారు జగన్. ఇందులో భాగంగా తొలి అడుగుగా నిన్న జరిగిన ఫంక్షన్ తో కొంత సానుకూల సంకేతాలు ప్ర భుత్వం దగ్గరకు వెళ్లాయి. అల్లు అరవింద్ కూడా తనకు చెందిన స్టూడియోల నిర్వహణను కానీ లేదా షూటింగ్ లు కానీ విశాఖ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు కోరుకుంటున్నారు. అన్నీ జరిగితే ఇండస్ట్రీ విశాఖ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలే ఎక్కువ.
వాస్తవానికి..గత కొద్ది కాలంగా ఏపీ సర్కారుకు, తెలుగు చిత్ర పరిశ్రమకూ మధ్య దూరం పెరుగుతూ ఉంది. సినిమాల నిర్మాణానికి సంబంధించి తాము అవస్థలు పడుతుంటే, టికెట్ రేట్లు తగ్గించి తమకు మరింత భారంగా వైసీసీ పెద్దలు మారారని ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఆరోపణ. ఈ దశలో పరిశ్రమ వర్గాలు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందుకు ప్ర భుత్వం తరఫు నుంచి మరింత సానుకూలత వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఇదే సందర్భంలో మంచి వాతావరణం కల్పిం చేందుకు నిన్నటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యా చిలర్ సినిమా ఫంక్షన్ ఓ చక్కని వేదికైంది. వైసీపీ పెద్దలే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లూ చేయించారు. అంతేకాదు విశాఖ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తామని అవంతి శ్రీను లాంటి మంత్రులు చెప్పి, ఇండస్ట్రీ వారికి ఓ సానుకూల వాతావరణం సృష్టించారు.
నిన్నటి వేళ వైజాగ్ లో జరిగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ లో అక్కినేని చిన్నోడు అఖిల్ తన స్పందనను తెలియ జేస్తూ.. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పాడు. సినిమా బాగా ఆడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూనే, ఫంక్షన్ చేసేందుకు స హకరించిన అవంతి శ్రీను ధన్యవాదాలు చెప్పాడు. అంతేకాదు వందశాతం థియేటర్ ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చిన సీఎంకు ధన్య వాదాలు తెలిపాడు. దీంతో సీఎం జగన్ కూ, పరిశ్రమకూ ఉన్న కాస్త దూరం కూడా తగ్గే ఉంటుందన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
సినిమా వాళ్ల సంక్షేమానికి ప్రభుత్వం ఏం చేయాలో అంతా చేస్తుందని, ఇందులో సందేహాలకు తావే లేదని మంత్రి అవంతి స్ప ష్టం చేశారు. వైజాగ్ లో కనీసం 25 శాతం షూటింగ్ లు జరిగేలా అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు చర్యలు తీసుకోవాలని,ముందుకు రా వాలని కూడా కోరారు. ఇదే వేదికపై విశాఖతో తనకున్న అనుంబంధాన్ని స్మరించుకున్నారు మెగా నిర్మాత అల్లూ అరవింద్. అ దేవిధంగా గతంలోనూ ఇప్పుడూ వైజాగ్ తన కుటుంబంలో భాగంగా ఉందని చెప్పి., తన మిత్రుడు గంటా శ్రీనివాసరావు పేరు నూ ప్రస్తావించి, ఆయనతో ఉన్న అనుబంధాన్నీ గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇండస్ట్రీ కి చెందిన కీలక ఘట్టం ఒకటి ఇప్పుడు మొదలయింది. వైజాగ్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి మంత్రి అవంతి శ్రద్ధ చూపిస్తున్నారు కనుక ఆ దిశగా ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాల్సి ఉంది.